సరిగ్గా మూడున్నర ఏళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది..2019 మే లో జగన్ ప్రభంజనం సృష్టించారు. చరిత్రలో ఎన్నడూ విధంగా వైసీపీకి భారీ విజయం సాధించారు. అనూహ్యంగా 175 సీట్లకు 151 సీట్లు గెలిచి తొలిసారి అధికార పీఠం దక్కించుకున్నారు. ఇలాంటి భారీ విజయం ఎప్పుడో ఒకసారి అరుదుగా వస్తూ ఉంటుంది. అలాంటి అరుదైన విజయాన్ని సొంతం చేసుకుని పాలన చేస్తున్న జగన్…వచ్చే ఎన్నికల్లో అంతకంటే గొప్ప విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. 175కి 175 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
ఇక ఆ టార్గెట్ రీచ్ అవ్వగలరా..ఏపీ రాజకీయాల్లో 2019 నుంచి జగన్ వన్ మ్యాన్ షో గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే..2019 ఎన్నికల్లో విజయం పూర్తిగా జగన్ విజయమే. ఎందుకంటే ఆయన్ని చూసే జనం ఓటు వేశారు. అసలు చాలామంది ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. ఎందుకంటే పెద్దగా ఎమ్మెల్యేల పేర్లు కూడా తెలియకుండా ప్రజలు జగన్‌ని చూసి ఓట్లు వేసేశారు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా జగన్ వన్ మ్యాన్ షో కొనసాగుతుంది. పథకాల పేరిట బటన్ నొక్కుతూ ప్రజలకు నేరుగా డబ్బులు ఇస్తున్నారు. అలాగే వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏదైనా నేరుగా పని జరిగేలా సెట్ చేశారు. అసలు ప్రభుత్వం నుంచి ఏం వచ్చినా అది జగనే చేశారనే విధంగా ముద్రవేశారు. ఇక మూడున్నర ఏళ్ల పాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మూడు రాజధానులు ఒకటి. ఎక్కడా లేని విధంగా ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
అలాగే ప్రతిపక్షాలకు రాజకీయం ఎప్పటికప్పుడు తనదైన వ్యూహాలతో చెక్ పెడుతూ ముందుకెళుతున్నారు. సాధారణంగా మూడున్నర ఏళ్ళు అధికారంలో ఉన్నారంటే..ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. ప్రతిపక్షాలు బలపడతాయి. అయితే జగన్ ప్రభుత్వానికి కూడా అలాంటి నెగిటివ్ ఉంది గాని..ప్రతిపక్షం బలపడకపోవడంలో జగన్ పాత్ర చాలా ఉంది. ప్రతిపక్ష టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశారు. ఇలా మూడున్నర ఏళ్ళు జగన్ వన్ మ్యాన్ షో నడుస్తోంది. ఇదే వన్ మ్యాన్ షోతో 175 సీట్లు గెలుచుకోవాల. ఇక నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారుగా..వైసీపీ శ్రేణులంతా 175 టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి అదే టార్గెట్‌తో పనిచేయాలని డిసైడ్ అయ్యారు. మరి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యి.. రానున్న రోజుల్లో వన్ మ్యాన్ షో ఇలాగే కొనసాగుతుందేమో చూడాలి.