ఫోర్బ్స్ (Forbes) మేగజీన్ 2023 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాను రిలీజ్ చేసింది. ఫోర్బ్స్ మేగజిన్ ప్రతి సంవత్సరం ప్రపంచ కుభేరుల సంపద ఆధారంగా లిస్ట్‌ను విడుదల చేస్తుంది. ఆ జాబితాలో తొలి 10 మంది సంపన్నుల్లో భారతీయ ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కూడా ఉన్నారు. మరి మొదటి స్థానంలో ఉందెవరో తెలుసా..?
ఫ్రెంచ్ బిజినెస్ మ్యాగ్నెట్
2023 సంవత్సరంలో అత్యంత సంపన్నుడిగా ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బెర్నార్డ్ జీన్ అర్నాల్ట్ (Bernard Jean Étienne Arnault) నిలిచారు. ఆయన సంపద 211 బిలియన్ డాలర్లు. ఈ జాబితాలో 200 బిలియన్ డాలర్లకు మించిన సంపద ఉన్నది ఈయన ఒక్కడికే. లగ్జరీ గూడ్స్‌కు సంబంధించిన ప్రీమియం బ్రాండ్ లూయీస్ వీటన్ (Louis Vuitton) ఈయనదే.
ట్విటర్‌ను కొనుగోలు చేసి, దాని మేనేజ్మెంట్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొని, ఆ తరువాత దాని పేరు ఎక్స్‌గా మార్చిన టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. గతంలో ఆయన ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ సంపద 180 బిలియన్ డాలర్లు.
టాప్ 10 లో ముకేశ్ అంబానీ
ఈ జాబితాలో టాప్ 10లో భరతీయ ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కూడా స్థానం సంపాదించారు. ఆయన ఈ జాబితాలో 9వ స్థానంలో నిలిచారు. ముకేశ్ అంబానీ సంపద 83.4 బిలియన్ డాలర్లు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది దాదాపు ప్రపంచ సంపన్నులంతా తమ సంపదలో కొంత భాగాన్ని నష్టపోయారు. స్టాక్స్ విలువ బాగా పడిపోవడం, రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, స్టార్ట్ అప్ లపై పెట్టిన పెట్టుబడులను నష్టపోవడం.. తదితర కారణాలతో వారు తమ సంపదలో ఎక్కవ భాగం కోల్పోయారు.
టాప్ 10 లిస్ట్ ఇదే..
ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలోని టాప్ 10లో ఆమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మూడో స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 114 బిలియన్ డాలర్లు.ఇక మిగతా స్థానాల్లో
4) ల్యారీ ఎలిసన్ – 107 బిలియన్ డాలర్లు.
5) వారెన్ బఫెట్ – 106 బిలియన్ డాలర్లు.
6) బిల్ గేట్స్ – 104 బిలియన్ డాలర్లు.
7) మైఖేల బ్లూమ్ బర్గ్ – 94.5 బిలియన్ డాలర్లు.
8) కార్లోస్ స్లిమ్ – 93 బిలియన్ డాలర్లు.
9) ముకేశ్ అంబానీ – 83.4 బిలియన్ డాలర్లు.
10) స్టీవ్ బాల్మర్ – 80.7 బిలియన్ డాలర్లు.