నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు, వేదాలు, శాస్త్రాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. వాటిల్లో రాసిన విషయాలను నమ్మేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే మనం ఈ సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధార పడి ఉంటుందని అవే పురాణాలు చెబుతున్నాయి. అలాగే మన కర్మ ప్రకారమే మనకు ఎప్పటికైనా మరణం వస్తుంది. కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. దీంతో మనకు మరణం కచ్చితంగా వస్తుందట. అలా పలు శాస్త్రాలే చెబుతున్నాయి. మరి ఏయే సంకేతాలు, సూచనలు కనిపిస్తే.. మనకు మరణం సంభవిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. ఆకాశంలో ఉండే పోల్ స్టార్‌ను ఎవరైనా చూడలేకపోతే వారు అదే సంవత్సరంలో చనిపోతారట. అలా అని పలు గ్రంథాలు చెబుతున్నాయి.
2. ఉదయం పూట సూర్యున్ని సరిగ్గా చూడలేని వారు 11 నెలల్లో చనిపోతారట.
3. ఒక వ్యక్తి ఇసుక మీద నడిచినప్పుడు అతని పాదాల ముద్రలు ఇసుకపై సరిగ్గా పడకపోతే అప్పుడు ఆ వ్యక్తి 7 నెలల్లో చనిపోతాడట.
4. ఒక వ్యక్తి తలపై రాబందు లేదా కాకి కూర్చుంటే ఆ వ్యక్తి చాలా త్వరగా చనిపోతాడని తెలుసుకోవాలి. కనీసం 6 నెలల్లో ఇలాంటి వ్యక్తులు చనిపోతారట.
5. ఎవరైనా ఒక వ్యక్తికి చెందిన రూపం చుట్టూ ఉన్న దుమ్ము లేదా మేఘాల్లో కనిపిస్తే ఆ వ్యక్తి 4 నుంచి 5 నెలల్లో చనిపోతాడట.
6. వర్షం పడుతున్నప్పుడు మేఘాలు ఢీకొంటే వచ్చే మెరుపులను ఎవరైనా చూడలేకపోతే అలాంటి వ్యక్తి 2 , 3 నెలల్లోనే చనిపోతాడట.
7. ఒక వ్యక్తి స్నానం చేశాక వెంటనే అతని కాళ్లు కడుక్కుంటే.. పాదాలు త్వరగా ఎండిపోతే అలాంటి వ్యక్తి 10 రోజుల్లోనే చనిపోయేందుకు అవకాశం ఉంటుందట.
8. దీపాన్ని ఆర్పినప్పుడు దాని పొగ నుంచి వచ్చే వాసనను ఎవరైనా గ్రహించలేకపోతే వారు కూడా త్వరగా చనిపోతారట. ఈ విషయాలను పలు పురాణ గ్రంథాల్లో వివరించారు.