సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ను కలిగిన స్టార్ హీరోస్ వీళ్లే..!!

-

ఈ మధ్యకాలంలో నటీనటులు సైతం ఏదైనా తమ గురించి తెలియజేయాలి అంటే ఎక్కువగా సోషల్ మీడియానే ఉపయోగిస్తూ ఉన్నారు. అందులో అత్యధికంగా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారానే తెలియజేస్తూ ఉన్నారు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సినీ సెలబ్రిటీస్ గురించి తెలుసుకుందాం.Allu Arjun creates record after Vijay Devarakonda

ఇంస్టాగ్రామ్ లో అత్యధికంగా ప్రజాదారణ పొందిన స్టార్ హీరోల జాబితాలలో 8 మంది ఉన్నారు. ఈ జాబితాలలో విజయ్ దేవరకొండ ను వెనక్కు నెట్టి అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నారని చెప్పవచ్చు. అందుకు కారణం పుష్ప చిత్రంలోని బన్నీ యాక్టింగే కారణం.. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించడమే కాకుండా క్రేజ్ ను సైతం పెంచుకున్నాడు అల్లు అర్జున్. ఇక తన సినిమాల ప్రకటనలకు సంబంధించి , ప్రమోషన్స్ కు సంబంధించి తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అల్లు అర్జున్. ఇక అంతే కాకుండా పలు బ్రాండ్ లను ప్రమోట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ గా మారుతూ ఉంటాడు అల్లు అర్జున్.

ఇక అల్లు అర్జున్ తర్వాత స్థానంలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్ దేవరకొండ. ఇక అల్లు అర్జున్ 18.8 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉండగా…. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 16.9M, ఆ తర్వాత స్థానంలో హీరో యశ్ 11 M, మరొక స్థానంలో దుల్కర్ సల్మాన్ 11 M , ఆ తర్వాత స్థానం మహేష్ బాబు 8.7 M, ఆ తర్వాత స్థానం ప్రభాస్ 8.6 M, ఆ తర్వాతి స్థానం రామ్ చరణ్ 8.2M , చివరిగా ఎన్టీఆర్ 4.5 M వ్యూస్ ని దక్కించుకున్నారు ఇక టాప్-1 లో అల్లు అర్జున్ , టాప్-2 లో విజయ్ దేవరకొండ, టాప్-3 లో మాత్రం దుల్కర్ సల్మాన్, యష్ నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news