ఇండియాలో టాప్‌ సెవన్‌ రిస్కీ గవర్నమెంట్‌ జాబ్స్ ఇవే..! ఇంట్రస్ట్‌ ఉందా.?

-

ఏ జాబ్‌లో అయినా.. ప్రజర్‌, టెన్షన్స్‌, రిస్క్‌ ఫ్యాక్టర్‌ ఉండటం కామన్. పీస్‌ఫుల్‌ ఉండే జాబ్స్‌ చాలా అరుదు. అయితే టెన్షన్‌ సంగతి పక్కన పెడితే.. రిస్క్‌తో కూడుకున్న గవర్నమెంట్స్‌ జాబ్స్‌ ఏంటో తెలుసా..! ఆ జాబ్‌ చేసే వాళ్లు.. పాపం అహర్నిశలు శ్రమిస్తూ ఉండాల్సిందే.. నిత్యం ఒత్తిడితో వేగాల్సిందే.. ఇండియాలో టాప్‌ సెవన్‌ రిస్కీ జాబ్స్‌ ఏంటో ఈరోజు చూద్దామా..!

1. DRDO రీసెర్చర్:

DRDO రీసెర్చర్లు కమిట్మెంట్‌తో ఉండాలి. చాలా ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగం ఇది. ప్రతీ రోజు కూడా ఎక్కువ సమయం పాటు పని చెయ్యాల్సి ఉంటుంది. ఫిజికల్‌గా ఎటువంటి డేంజర్ ఉండకపోయినా మెంటల్‌గా చాలా రిస్క్‌తో పని చేస్తుంటారు.

2. ఇస్రో సైన్టిస్ట్:

చాలా మంది సైన్స్ స్టూడెంట్స్‌కి ఇస్రో సైంటిస్ట్ అవ్వాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే చాలా రిస్క్ భరించాల్సి ఉంటుంది. రీసెర్చ్ ఎక్కువ చేయడం మొదలు ప్రతీది కూడా రిస్క్‌తో కూడుకుని ఉంటుంది. కానీ అద్భుతాలు సృష్టించవచ్చు ఈ జాబ్‌లో.

3. ఆర్మ్డ్ ఫోర్సెస్:

పోలీస్ ఫోర్స్, CRPF, CISF, NSG కమాండోస్ మొదలైన వాళ్లందరికీ కూడా రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి, అలానే కష్టపడి పని చెయ్యాల్సి ఉంటుంది.

4. ఫారెస్ట్ రేంజర్:

ఇది అంత ఈజీ జాబ్‌ ఏం కాదు.. జంతువులను రక్షించడం కోసం వీళ్ళు ఎంతగానో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆర్మ్డ్ హంటర్స్ నుంచి కూడా సురక్షితంగా ఉండాలి. ఎప్పుడు ముప్పు వస్తుందనేది చెప్పలేము.

5. ఇంటిలిజెంట్ బ్యూరో:

ఇంటిలిజెంట్ బ్యూరో ఆఫీసర్ 24 గంటలూ పని చేయాల్సి ఉంటుంది. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో డేంజర్‌తో కూడుకున్న జాబ్ ఇది.

6. ఆర్కియాలజిస్ట్:

ఆర్కియాలజిస్ట్ కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో రిస్క్ ను తీసుకోవాల్సి ఉంటుంది. చారిత్రక ప్రదేశాలు, స్మారక కట్టడాలు వంటి వాటిని రక్షిస్తూ ఉండాలి.

7. RAW ఏజెంట్:

రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్‌.. వీళ్ళ జాబ్ కూడా చాలా రిస్క్ తో కూడి ఉన్నది. మనం సినిమాల్లో చూసినట్టే వీళ్ళ ఉద్యోగం ఉంటుంది. గూఢాచారిలా ఉంటూ..నిత్యం ప్రాణాలతో చెలగాటాలు ఆడాల్సిందే.

ఇవే టాప్‌ సెవన్‌ రిస్కీ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ జాబ్‌ చేయడం ఎంత కష్టమో… అసలు ముందు సంపాదించడం కూడా అంతే కష్టం. అయితే వీళ్ల శాలరీలు మాత్రం అధిక మొత్తంలోనే ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news