ఎలుకలు ఒకసారి ఇంట్లోకి అలవాటు అయితే ఇక పోనే పోవు..కాగా, తాజా అధ్యయనంలో ఎలుకలు కొన్ని పండ్లను చూస్తే పారిపోతాయని తేలింది.ఎలుకలను భయపెట్టే ఆ పండు ఏంటో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..మగ ఎలుకలు అరటిపండ్లకు భయపడతాయని తాజా అధ్యయనంలో తేలింది. క్యూబెక్‌లో మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పరిశోధకులు తెల్చెసారు.
గర్భిణీ, బాలింత ఎలుకల దగ్గరున్న మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గ్రహించారు. మగ ఎలుకల్లో హార్మోన్ల మార్పులు, ఆడవారి మూత్రంలో n-పెంటిల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తున్నట్లు. ఇక, ఇదే సమ్మేళనం అరటిపండ్లకు ప్రత్యేకమైన వాసనను కూడా ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు..గర్భిణీ ఎలుకల్ని మరొక ప్రయోగం కోసం మా ల్యాబ్‌లో ఉంచాము. వాటి దగ్గరున్న మగ ఎలుకలు వింతగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు పరిశోధనలో ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్రహించారు.
మగ ఎలుకలు అరటి వాసనకు ఒత్తిడికి గురవుతున్నాయి..విపరీత మైన టెన్షన్ ను కలిగి ఉంటాయి.ఆడవారి మూత్రంలో రసాయనాలకు ప్రతిస్పందనగా మగవారిలో ఒత్తిడి స్థాయిలు పెరగడాన్ని గమనించినప్పుడు, వేరే మూలం నుండి n-పెంటైల్ అసిటేట్ కూడా అదే ప్రతిస్పందనను ప్రేరేపిస్తుందా అని పరిశోధకులు ఆశ్చర్యపోయారు. అందుకని, వారు స్థానిక సూపర్ మార్కెట్ నుండి అరటి నూనెను పొందారు.దూది తో ముంచి అవి ఉండే బోనులో వేస్తే ఎలుకలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.. అందుకే ఎలుకలు ఎక్కువగా ఉండే ఇంట్లో అరటి పండ్లను ఉంచండి.. దెబ్బకు ఎలుకలు పారిపోతాయి..