వేసవి కాలంలో కూడా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కలగచ్చు. వేసవి కాలంలో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వేసవికాలంలో చేసే పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా వీటిని అనుసరించడం చాలా ముఖ్యం. వీటి పట్ల శ్రద్ధ వహించకపోతే ఆస్తమా తప్పదు. వేసవికాలంలో ఈ ఆరు కారణాల వలన ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. అయితే మరి వేసవికాలంలో ఎందుకు ఆస్తమా వస్తుంది..? ఎలాంటి విషయాల పట్ల శ్రద్ధ పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలర్జీలు, వ్యాయామం, ఒత్తిడి మొదలైన కారణాల వలన ఆస్తమా కలగచ్చు కాబట్టి వేసవికాలంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆస్తమాను తీసుకు వస్తాయి. ఎయిర్ పొల్యూషన్ వలన ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గాలి కాలుష్యం వలన ఊపిరితిత్తుల్లో సమస్యలు కలుగవచ్చు. దుమ్ము మొదలైన కారణాలు వలన కూడా గాలి యొక్క నాణ్యత తగ్గుతుంది. ఇది ఆస్తమాని కలిగించవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి.
వేసవికాలంలో హ్యుమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అటువంటప్పుడు ఆస్తమా ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంపై కూడా శ్రద్ధ వహించండి. ఆస్తమా కలగకుండా చూసుకోండి. ఎలర్జీల వలన కూడా ఆస్తమా రావచ్చు. కాబట్టి ఎలర్జీల బారిన పడకుండా చూసుకోవాలి. మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు ఉండే చోట ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి దుమ్ము ధూళి వలన కూడా ఇబ్బందులు కలుగుతాయి. అలానే వేసవికాలంలో పురుగుల వలన కూడా మనకి ఆస్తమా రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో తప్పక శ్రద్ధ పెట్టండి. ఏ సమస్య లేకుండా అప్పుడు ఉండచ్చు.