గ్రేటర్ పోలింగ్ : ఈ అగ్ర హీరోలు దూరం !

Join Our Community
follow manalokam on social media

గ్రేటర్ ఎన్నికలు ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. అందుకే ఒకరకంగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ఎలా అయినా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని అన్ని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలకు ముగ్గురు టాలీవుడ్ అగ్ర హీరోలు దూరంగా ఉండనున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు షూటింగ్ నిమిత్తం పూనే లో ఉన్నారు. అలానే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా షూటింగ్ కోసం మారేడుమిల్లిలో ఉన్నారు. దీంతో వీరు వోటింగ్ కు దూరంగా ఉండనున్నారు.

ఇక వోటు హక్కు వినియోగించుకునే వారి విషయనికి వస్తే జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి & ఫ్యామిలీ, కృష్ణంరాజు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. జూబ్లీహిల్స్ తెలంగాణ విమెన్ కోపరేట్ సొసైటీ లో నాగార్జున, అమల, సమంత, చైతన్య, అఖిల్ లు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. అల్లు అర్జున్ ఇంటి ముందు ఉలవచారు రెస్టారెంట్ కి వెళ్లే రూట్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ లో అల్లు స్నేహ, అల్లు శిరీష్ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఇక జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్ లో మహేష్ బాబు, నమ్రత, నరేష్, కృష్ణ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. జూబ్లీహిల్స్  ఓబులరెడ్డి స్కూల్ లో ఎన్టీఆర్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.

TOP STORIES

10వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. వెంట‌నే అప్లై చేయండి..!

తెలంగాణ స‌ర్కిల్‌లో గ్రామీణ్ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్) పోస్టుల భ‌ర్తీకి గాను ఇండియా పోస్ట్ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగానే...