బండి సంజయ్ మీద దాడి : దీక్షకు దిగిన నేతలు

Join Our Community
follow manalokam on social media

అధికార పార్టీ దౌర్జన్యాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పై దాడికి యత్నించడం, ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర కు నిరసనగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, గ్రేటర్ ఎన్నికల మేనేజ్మెంట్ కన్వీనర్ లక్ష్మణ్ దీక్షకు దిగారు. ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ దీక్ష చేయనున్నారు. ఈ సంధర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు డీకే అరుణ, లక్ష్మణ్, వివేక్ వెంకట స్వామి, గరికపాటి మోహన్ రావు లు దీక్ష చేస్తున్నారని అన్నారు.

మీడియా మిత్రులతో కలిసి టీ తాగడానికి పీపుల్స్ ప్లాజా మినర్వా హోటల్ కి వెళ్ళామని బయటికి వచ్చి కారులో కూర్చునే టైమ్ లోనా పై ఎంఐఎం గుండాలు దాడికి యత్నించారు. అంతలోనే టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి అక్కడికి వచ్చి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసిందని, పోలీసులు, కార్యకర్తలు నన్ను అక్కడి నుండి పంపించారని అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలి.. కార్యకర్తలు సంయమనంతో ఉండాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

TOP STORIES

బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి....