ఈ మొక్కలని ఎంతో సులువుగా పండించొచ్చు…!

-

ఇప్పటి కాలంలో కెమికల్స్ వేసిన పంటను పండిస్తున్నారు. వీటిని తినడం వల్ల మనకు ఏ మాత్రము ఆరోగ్యం ఉండదు. ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి సులువైన పరిష్కారం ఏమిటంటే…? ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూరగాయలు లేదా పండ్లని పండించుకోవడం. సులువుగా మన ఇళ్ళల్లో ఎటువంటి కూరగాయలు లేదా పండ్లు పండించుకోవచ్చు…? ఈ విషయం లోకి వస్తే… మన ఇళ్ళల్లో చాలా కామన్ గా కొన్ని మొక్కల్ని పెంచవచ్చు. వీటివల్ల మనకి మంచి పౌష్టిక ఆహారం లభిస్తుంది. ఆరోగ్యం కూడా మన చెంత ఉంటుంది. ఇక సులువుగా ఇంట్లో పండించుకునే మొక్కలు కోసం చూద్దాం….

కొత్తిమీర:

కొత్తిమీర ఏడు నుంచి పది రోజుల్లో సులువుగా మన ఇళ్లలో పెరుగుతుంది. మనం నిత్యం పప్పు, సాంబార్, కూర ఇలా అన్నిటిలోనూ వాడుతూ ఉంటాము. విరివిగా వాడే కొత్తిమీరని ఎక్కడైనా చిన్న ప్రదేశమున్నా పండించవచ్చు. ధనియాలు తో కొత్తిమీర ని ఇంట్లో ఎంతో సింపుల్ గా పెరిగించొచ్చు.

బంగాళదుంపలు:

ఇంట్లో సులువుగా పెంచే కూరగాయల లో ఇవి ఒకటి. ఒక్కొక్కసారి మనం గమనిస్తే వాటంతటవే ఎదిగి పోతూ ఉంటాయి. దీని మీద పెద్దగా శ్రద్ధ కూడా పెట్టక్కర్లేదు. ఎప్పుడైనా బంగాళదుంపని మట్టిలో చాలా రోజులు అలా వదిలేస్తే అవి వాటంతట పెరిగిపోతాయి. కనుక ఎంతో సింపుల్ గా మీరు బంగాళదుంపలని మట్టిలో లేదా కుండీలో పాతేయండి. దీనివల్ల సులువుగానే వేర్ల నుంచి కొత్త మొక్కలు వచ్చి బంగాళదుంపలు కాస్తాయి.

గుమ్మడి కాయలు:

కొంచెం గుమ్మడి విత్తనాలను తీసుకొని పాతితే… చాల సులువుగా ఇవి వచ్చేస్తాయి. చాల మంది ఇళ్లల్లో వీటిని ఎంతో సింపుల్ గా పండిస్తూ ఉంటారు.

టమాటా:

టమాటా గింజల నుంచి మొక్కలు పండించవచ్చు. మీరు కొంచెం గింజలని మట్టిలో వేసి కొద్దిగా శ్రద్ధ పెడితే చాలు టమాటా మొక్కలు వచ్చేస్తాయి. ఇలా ఇళ్లల్లో దొండకాయలు, వంకాయలు, పొట్లకాయలు వగైరా వాటిని ఎంతో సులువుగా పెంచొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version