ఈ భూమి మీద నివసించే ఏ ప్రాణి అయినా సరే సంతోషంగా జీవితాన్ని గడపాలి అని..అందుకోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల జీవితాన్ని సంతోషంగా గడిపలేకపోతున్నారు. ఇక పోతే ఎవరైనా సరే జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ప్రముఖ వ్యక్తి ఆచార్య చాణిక్యుడు చెప్పిన మాటలు మనం తప్పకుండా ఆచరణలో పెట్టాలి . ఈయన మాటలు వింటే జీవితంలో సుఖ సంతోషాలతో మంచి మార్గంలో నడవడానికి బాటలు కూడా ఏర్పడతాయి. మరి చాణిక్యుడు తెలిపిన ఆ నీతి సూత్రాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
కొంతమంది తమ పనులను పూర్తి చేసుకోవడం కోసం ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉంటారు. ఒక అబద్ధం చెబితే దానిని కప్పిపుచ్చడానికి మరో అబద్ధం చెప్పాల్సిన వస్తుంది. ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల మీ పని పూర్తి అవుతుందేమో కానీ ఎప్పుడో ఒకప్పుడు అబద్దం అనేది బయట పడుతుంది.ఇలా చేస్తే మీ పై మీకే నమ్మకం కోల్పోవడమే కాదు ఇతరులకు కూడా మీ మీద గౌరవం కోల్పోతారు. ఇక అత్యాశ అనేది అస్సలు పనికిరాదు. ఉన్న దానితోనే తృప్తి పడాలి లేదా మరెన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అత్యాశకు ఇంకా ఏదైనా కావాలని కోరుకుంటే జీవితంలో ఎప్పటికీ సంతోషం అనేది ఉండదు.
ఎదుటి వ్యక్తితో సూటిగా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే కచ్చితంగా ఎదుటి వారు మనకు శత్రువులు అవుతారు. కాబట్టి ప్రతి మనిషి తో కూడా నిదానంగా ఆలోచించి ఇతరులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే కచ్చితంగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి తగ్గట్టు ఆలోచనలు చేసినప్పుడే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఇక అంతే కాదు కోపం మనిషికి శత్రువులను దగ్గర చేస్తుంది. కాబట్టి కోపాన్ని వీడి మంచి మార్గం వైపు వెళ్తే కచ్చితంగా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు.