విద్యార్థులకు శుభవార్త.. రేపే తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు…

-

ఇటీవల ఇంటర్‌ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ శుభవార్త చెప్పింది. ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ ఏడాది దాదాపు 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలను రాశారు. సమాధాన పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో కొనసాగింది. రేపు విడుదల కాబోతున్న ఇంటర్ రిజల్ట్స్ ను ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ sbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

TS Inter results 2020: Intermediate second year to be released before June  15

పదో తరగతి ఫలితాల విషయానికి వస్తే… ఆన్సర్ షీట్స్ మూల్యాంకనం ఇంకా కొనసాగుతోంది. టెన్త్ రిజల్ట్స్ జూన్ 25న లేదా 26న ప్రకటించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాత ఇంటర్ ఫస్టియర్ క్లాసులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ సెకండియర్ క్లాసులు ఈ నెలలోనే ప్రారంభమవుతాయి. 10వ తరగతి వరకు పాఠశాలలు నిన్ననే ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news