ఆహారాన్ని నమిలి తినకపోతే ఈ సమస్యలు వస్తాయి..!

-

జీర్ణప్రక్రియ నమలడం నుండి మొదలవుతుంది. మనం తీసుకునే ఆహారం బాగా నమిలి తింటే మంచిదని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ రోజు దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. అయితే సరిగ్గా నమిలి తినడం వల్ల నెమ్మదిగా తినొచ్చు మరియు తక్కువ తినొచ్చు.

 

పైగా జీర్ణ సమస్యలు రాకుండా బాగా ఉండచ్చు. అయితే నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఎంత వేగంగా తింటే అంత ఎక్కువ తీసుకోవడానికి వీలవుతుందని… బాగా నమిలి తినడం వల్ల నెమ్మదిగా తింటామని తక్కువ తింటామని చెప్తున్నారు. అయితే రీసెర్చ్ చేసిన దాని ప్రకారం 30 మంది మహిళలని స్టడీ చేయగా… నెమ్మదిగా నమిలి తినే మహిళల్లో చూస్తే తక్కువ తిన్నట్లు తెలుస్తోంది.

నమిలి తినడం వల్ల పోషక పదార్థాలు బాగా అందుతాయి. ఆకలి కూడా తగ్గుతుంది. అయితే ఆహారాన్ని నమిలి తినకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది చూస్తే… ఆహారం నమిలి తినకపోవడం వల్ల ఇబ్బంది కూడా వస్తాయి అని నిపుణులు అంటున్నా.రు మరి ఏ ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

సరిగా నమిలి తినకపోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు గుర్తించారు. అలాగే సరిపడా ఎంజైమ్స్ ని అది ప్రొడ్యూస్ చేయలేదు. అలానే బ్లోటింగ్, డయేరియా, గుండెలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్, మాల్ న్యూట్రిషన్ సమస్యలు వస్తాయి కనుక ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా నమిలి తినండి దీని వల్ల ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news