అలర్ట్ : ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలంటే ఈ రూల్స్ తప్పనిసరి !

-

క్రికెట్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ హంగామా మళ్లీ షురూ కానున్నది. క్రికెట్ ల‌వ‌ర్స్ మ‌దిని దోచినా ఐపీఎల్ .. ఏడాది తిరక్కుండానే మూడోసారి ముందుకొచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ 14.. మళ్లీ నేటి నుంచి యూఏఈ వేదికగా కొనసాగనుంది. ఇందులో భాగంగానే నేడు చైన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు మరియు ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య మొదటి మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


ఈ నేపథ్యం లో యూఏఈ స్టేడియాలు కొత్త రూల్స్‌ పెట్టాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ మ్యాచ్‌ లకు ఫ్యాన్స్ ను అనుమతించడం పై కొత్త నియమాలు అమలు చేస్తోంది. మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు పీసీఆర్‌ రిపోర్ట్‌ అవసరం లేదని దుబాయి స్టేడియం పేర్కొంది. అయితే… టీకా వేసుకున్నట్లు సర్టిఫికేట్‌ తేవాలని వెల్లడింది. అలాగే… షార్జా స్టేడియం మాత్రం పీసీఆర్‌ రిపోర్ట్ మరియు టీకా వేసుకున్నట్లు సర్టిఫికేట్‌ తో రావాలని స్పష్టం చేసింది. ఇక 16 ఏళ్లు పైబడిన వారినే అనుమతిస్తామని చెప్పింది. అటు అబుదాబీ స్టేడియం కూడా ఈ రూల్స్‌ నే అమలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news