కరోనాపై తిరుగులేని విజయం సాధించారు మన వాళ్ళు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం తో కేంద్ర ప్రభుత్వం కలవరపడుతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం కొన్ని రాష్ట్రాలకు ఇప్పుడు మన దేశంలో సాధ్యం కావడం లేదు, మహారాష్ట్రలో అత్యధికంగా మూడు వేల కేసులు నమోదు అయ్యాయి. ఇక తమిళనాడు,దేశ రాజధాని ఢిల్లీ లో భారీగా కేసులు ఉన్నాయి.

దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే కరోనా వైరస్ అడుగు పెట్టిన అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడి ప్రజలు ఈ మహమ్మారిపై భారీ విజయం సాధించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా సోకిన వారంతా కోలుకున్నారు. మొత్తం 11 మందికి కరోనా సోకింది.

అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ట్విట్టర్ లో కీలక ప్రకటన చేసారు. అక్కడ కరోనా వచ్చిన వాళ్ళు అందరూ కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని కరోనా కట్టడికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. ఏది ఎలా ఉన్నా ఒక్క మరణం కూడా లేకుండా కరోనా వైరస్ ని దీవుల నుంచి తరిమి కొట్టడం నిజంగా అభినందనీయం…

Read more RELATED
Recommended to you

Latest news