మీరు మీ స్నేహితులతో పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నారా..? నిజానికి ఒక్కసారైనా ఈ ప్రదేశాలకి మీ స్నేహితులతో వెళ్లాలి. అంత అద్భుతంగా ఉంటాయి ఈ ప్రదేశాలు. వీటిలో మీరు ఏదైనా మంచి ప్లేస్ కి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళచ్చు. ఇవే బెస్ట్ ప్లేసెస్.
ఈ ప్రదేశాలకు వెళ్లడం వలన మీకు ఎటువంటి నిరాశ కలగదు. కచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మరి స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకునేవారు ఈ కథనాన్ని చూసి ఈ ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. మరి ఆలస్యం ఎందుకు ఆ ప్రదేశాల లిస్ట్ చూసేద్దాం.
లేహ్ లడఖ్:
అడ్వెంచర్లు ఇష్టపడే వారికీ లేహ్, లద్దాఖ్ పర్ఫెక్ట్. టిబెటన్ సంస్కృతి, వంటకాలు, పండుగలకు ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందింది. రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్ ఇలా ఎన్నో వాటితో ఎంజాయ్ చేసేయచ్చు. అదిరిపోతోంది.
చిరపుంజి మేఘాలయ:
ఇక్కడకి కూడా వెళ్లి రావచ్చు. చిరపుంజి చూడడానికి ఎంతో బాగుంటుంది. “జ్యువెల్ క్రెస్ట్ ఆఫ్ మేఘాలయ” అని దీన్ని పిలుస్తారు. స్నేహితులతో ఎక్కడికైనా వెళ్లాలని అనుకునేవారు ఇక్కడకి కూడా వెళ్ళచ్చు.
కోజికోడ్ కేరళ:
స్నేహితులతో ఇక్కడకి వెళితే ఎంతో బాగుంటుంది. ఫుడీస్ కి అయితే మరీ బాగుంటుంది. ఇక్కడ బీచ్లు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాలు మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటాయి. అలానే ఇక్కడ మీరు జలపాతాలు, నదులు ఇలా ఎన్నో చూడచ్చు.
గోవా:
పక్క పెళ్లి కి ముందు ఫ్రెండ్స్ తో చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. సీఫుడ్ బాగుంటుంది ఇక్కడ. అలానే ఇక్కడ ప్రకృతి కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. చారిత్రక కట్టడాలు, ట్రెక్కింగ్ మొదలైనవి కూడా మీరు ఎంజాయ్ చెయ్యచ్చు.