పటాన్‌చెరులో రూ.183 కోట్లతో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్‌కు రూ.10 కోట్లు ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని.. తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందని తెలిపారు. పటాన్‌చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని చెప్పిన సీఎం.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే కచ్చితంగా మెట్రో వస్తుందని అన్నారు. పటాన్‌చెరు ఇంకా అభివృద్ధి చెందాలని అన్నారు. ఇక్కడికి త్వరలో ఐటీ కంపెనీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి తారుమారైనట్లు తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారని, మంచి ప్రభుత్వం, అభివృద్ధితో భూముల ధరలు పెరుగుతాయన్నారు.
వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే సంగారెడ్డి నుండి హయత్ నగర్ కు మెట్రో వస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్కో మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, ప్రతి డివిజన్ కు రూ.10 కోట్లు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ కావాలని అడుగుతున్నారని, దీనిని నెరవేరుస్తామన్నారు. పటాన్ చెరు వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బాగా పని చేస్తున్నారన్నారు. గతంలో పటాన్ చెరులో కరెంట్ కోసం సమ్మెలు చేసేవారని, ఇప్పుడు 24 గంటల విద్యుత్ వల్ల ఇక్కడి పరిశ్రమలు నిరంతరం మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయన్నారు. పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. హైదరాబాద్ నలువైపులా ఐదు పెద్ద ఆసుపత్రులు వస్తున్నాయని చెప్పారు.