వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తారు..? వస్తున్నారు..? వచ్చేశారు..? ఇలా రోజుకో న్యూస్ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీటిని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ షర్మిల ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నా.. షర్మిల రీసెంట్ యాక్టివిటీస్ మాత్రం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. పాదయాత్రలో స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్ చేశారు. ఆయనను పరామర్శించారు. భట్టి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న షర్మిల ఆతర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారే ప్రచారం జోరుగా వినిపిస్తున్న వేళ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల రాహుల్ గాంధీ బర్త్ డే సందర్భంగా విష్ చేసిన షర్మిల తాజాగా భట్టి విక్రమార్కను ఫోన్‌లో పరామర్శించడం ఆసక్తిగా మారింది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భట్టిని పరామర్శించిన రోజే షర్మిల కూడా సీఎల్పీ లీడర్‌ను పలకరించడం హాట్ టాపిక్‌గా మారింది.