కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ తో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నా రు. బీదా బిక్కీ, మధ్యతరగతి, ఉన్నతస్థాయి.. ఇలా అన్ని వర్గాలు కూడా కరోనా ఎఫెక్ట్‌తో ఇళ్లకే పరిమితమ య్యారు. అదేసమయంలో పరిశ్రమలు మూతబడడం, కంపెనీలు తెరుచుకోకపోవడంతో ఉపాది లేక ఇబ్బం ది పడుతున్న వారు కూడా ఉన్నారు. ఇక, మధ్యతరగతిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలోనూ 65 శాతం మంది ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులుగా జీవితాలను నడిపిస్తున్నారు. అయితే, ఇప్పుడు అటు ప్రైవేటు, ఇటు ప్రభుత్వం అనే తేడా లేకుండా అందరూ కూడా ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టారు.
వారి వారి స్థాయిలను బట్టి.. ఉద్యోగులకు 30 నుంచి 60 శాతం వరకు కూడా కోత పెట్టారు. దీంతో గత నెల పదోతేదీ నాటికి ఉన్న పరిస్థితి కేవలం ముప్పయి రోజుల్లోనే తలకిందులైంది. అంటే సగానికి సగం జీతం తగ్గిపోయింది. మరి ఇలాంటి పరిస్తితిలో మధ్యతరగతి వేతన జీవులు ఏం చేయాలి? ఎలా కుటుంబాలను నడిపించాలి? అనేది ప్రధానంగా తెలుసుకోవాలి. గతంతో పోలిస్తే.. వర్తమానం, వర్తమానంతో పోలిస్తే.. భవిష్యత్తు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నిజం. ఈ క్రమంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి వచ్చిన వేతనంతోనే సంతోషంగా గడిపే మార్గాలను అన్వేషించాలి. అవేంటో చూద్దాం..
- చిల్లర ఖర్చులకు పూర్తిగా చెక్ చెప్పాలి.
- అద్దె ఇళ్లలో ఉండేవారు రెంట్‌ను పూర్తిగా ఆపేయడం మంచిది కాదు.
- అలాగని పూర్తిగా చెల్లించడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.
- ఈ నేపథ్యంలో సగం రెంట్‌ను చెల్లించేలా యజమానితో ఒప్పందం చేసుకోవాలి.
- పెట్రోల్ ఖర్చును అదుపు చేసుకోవచ్చు. ఎలాగూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి!
- మాంసాహారులైతే.. పరిమితంగానే ఆ ఆహారాన్ని కొనుగోలు చేయడం ద్వారా వారం వారం ఖర్చు తగ్గుతుంది.
- నిత్యావసరాల విషయంలో మాత్రం పొదుపు పాటిస్తూనే కొంచెం ఎక్కువగానే కొనిపెట్టుకోండి
- వడ్డీలు పడతాయని ఆలోచించకుండా.. ఈఎంఐలను పూర్తిగా వాయిదా వేసుకోండి
- క్రెడిట్ కార్డుల్లోనూ వాయిదాసౌలభ్యం ఉంటే వాటిని కూడా ఆపుకోవచ్చు.
- ఎల్ ఐసీల జోలికి పోవద్దు.
- ఇంట్లోనే ఉండి.. ఏదైనా చేయడం ద్వారా ఆదాయ మార్గాలను వెతుక్కున్నా తప్పులేదు. సో.. అలా ప్రయత్నించి ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి