ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. కిలో పండిస్తే రూ.1 లక్ష ఆదాయం వస్తుంది..!

-

సాంప్రదాయ కూరగాయలు, పంటలను రైతులు పండించే రోజులు పోయాయి. ప్రస్తుతం అనేక మంది రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. అలాగే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. అవును.. బీహార్‌కు చెందిన ఆ వ్యక్తి కూడా సరిగ్గా ఇదే చేస్తున్నాడు. అతను పండిస్తున్న వెరైటీ పంట ఒక కిలోకు ఏకంగా రూ.1 లక్ష ఆదాయం వస్తోంది. ఇంతకీ ఆ పంట ఏది ? అంటే..

this is the costliest vegetable in india 1 kg gets rs 1 lakh

బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఉన్న నవీనగర్‌ బ్లాక్‌ కరండిహ్‌ గ్రామంలో అమ్రేష్‌ అనే వ్యక్తి హాప్‌ షూట్స్‌ అనే ఓ రకమైన మూలికల జాతికి చెందిన కూరగాయను పండిస్తున్నాడు. దీనికి ఐరోపా దేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ కూరగాయ

1 lakh per kg

ధర పలుకుతుంది. దీన్ని అనేక ఔషధాల తయారీలో వాడుతారు.

హాప్‌ షూట్స్‌ ఆకులు, పువ్వులు, కాయలను యాంటీ బయోటిక్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. వీటి సహాయంతో బీర్‌ను తయారు చేస్తారు. టీబీ చికిత్సకు ఉపయోగించే ఔషధాల్లో వీటిని వాడుతారు. అందుకనే ఈ పంటకు ఖరీదు చాలా ఎక్కువ. అయితే మొదట్లో అమ్రేష్‌ ఈ పంటను వేసినప్పుడు చూసిన వారంతా పిచ్చి పని చేస్తున్నాడని అనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసే సరికి అవాక్కయ్యారు. కాగా వారణాసిలోని ఇండియన్‌ వెజిటబుల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ లాల్‌ ఈ పంటను సాగు చేయమని చెప్పగా అమ్రేష్‌ చేశాడు. అయితే ఈ పంట విజయవంతంగా అందుబాటులోకి రావడంతో ఇకపై అక్కడ రైతుల ముఖ చిత్రం మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news