ముంబై లో క్రూయిజ్ షీప్ డ్రగ్స్ కేసు లో ఎన్‌సీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసును విచారణ చేసిన సమీర్ వాంఖడే ను ఈ కేసు నుంచి ఎన్‌సీబీ తప్పించిందని సమాచారం.. అలాగే ఈ కేసు మొత్తాన్ని సెంట్రల్ యూనిట్ కు ఎన్‌సీబీ అప్పగించింది. ఈ కేసు తో సంబంధం ఉన్న మొత్తం 5 కేసులను కూడా సెంట్రల్ యూనిట్ కే అప్పగించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న సమీర్ వాంఖడే పై పలు అవినీతి ఆరోపణ లు ఉన్నాయి.
అలాగే మహారాష్ట్ర చెందిన మంత్రి నవాబ్ మాలిక్ కూడా కూడా ఇటీవల సమీర్ వాంఖడే పై అవినీతి అరోపణలు చేశారు. అలాగే షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు లో ఆర్యన్ ఖాన్ ను తప్పించ డానికి సమీర్ వాంఖడే లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అలాగే గతంలో సమీర్ వాంఖడే పై డ్రగ్స్ కేసు విషయంలో మంచి రికార్డు ఉందని పలువురు అంటారు. సమీర్ వాంఖడే పేరు చెబితే బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకుంటున్న నటీ నటులు భయం తో వణికిపోతారని అంటారు. అయితే ప్రస్తుతం సమీర్ వాంఖడే ను ఈ కేసు నుంచి తొలగించారన్న వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.