ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలివే..

-

ఈ వారం పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కొన్ని చిత్రాలు/సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేయండి.

యంగ్​ హీరో నాగశౌర్య నటించిన ‘కృష్ణ వ్రింద విహారి’ ఈ వారం 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐరా క్రియేషన్స్​ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు అనీష్​ ఆర్​.కృష్ణ దర్శకత్వం వహించారు. షెర్లియా సేతి హీరోయిన్​గా నటించింది. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. సీనియర్‌ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు.

శ్రీవిష్ణు కథనాయకుడిగా తెరకెక్కిన చిత్రం అల్లూరి.  కయాదు లోహర్‌, తనికెళ్ల భరణి, సుమన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా.. సంగీతం హర్షవర్థన్‌ రామేశ్వర్‌ సమకూర్చారు. ఈ చిత్రం ఈనెల 23న విడుదల కానుంది.

డి.సురేష్‌బాబు, సునీత తాటి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. శ్రీసింహా కోడూరి కథానాయకుడు. ప్రీతి అస్రాని కథానాయిక. సతీష్‌ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈచిత్రం 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.

సుధ, చమ్మక్‌ చంద్ర, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రం మాతృదేవోభవ. కె. హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 24న విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!

నెట్‌ఫ్లిక్స్‌

  • ద పెర్‌ఫ్యూమర్‌ (హాలీవుడ్‌) సెప్టెంబరు 21
  • జంతరా (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 23
  • ఎల్‌వోయూ (హాలీవుడ్‌) సెప్టెంబరు 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అందోర్‌  (వెబ్‌సిరీస్‌)  సెప్టెంబరు 21
  • ద కర్దాషియన్స్‌ (వెబ్‌సిరీస్‌2) సెప్టెంబరు 22
  • బబ్లీ బౌన్సర్‌ (తెలుగు) సెప్టెంబరు 23

ఆహా

  • ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (తెలుగు) సెప్టెంబరు 23
  • డైరీ (తమిళ చిత్రం) సెప్టెంబరు 23

అమెజాన్‌ ప్రైమ్‌

  • డ్యూడ్‌ (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 20
  • హుష్‌ హుష్‌ (హిందీ సిరీస్‌) సెప్టెంబరు 22

జీ5

  • అతిథి భూతో భవ (హిందీ) సెప్టెంబరు 22

సన్‌నెక్ట్స్‌

  • తిరు

Read more RELATED
Recommended to you

Latest news