ఈ ఏడాది ఇక ఐపీఎల్ లేనట్టేనా

-

కరోనా వైరస్ ప్రభావంతో ఈ ఏడాదిలో జరగాల్సిన ఐపీఎల్ సీజన్ ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 వరకూ ఐపీఎల్ ను వాయిదావ వేస్తున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఈ ఏడాది ఐపీఎల్ జరిగే అవకాశమే లేదని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి చర్చించేందుకు అన్ని ఫ్రాంచైజీల ఓనర్లు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నిర్వహణ గురించి బీసీసీఐతో ఒక అవగాహనకు రావాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ఎడిషన్ ఈ ఏడాది లేకపోతే ఫ్రాంచైజీలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ప్లేయర్లకు శాలరీలను చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. వీటితో పాటు మార్చండైస్ అమ్మకాల తగ్గుదవ వల్ల కూడా నష్టాలొస్తాయి. ఇక టికెట్ల అమ్మకాలు తదితరాలకు ఇన్సురెన్స్ అండగా ఉండనుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే చాలా మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కూడా ఉంది. దీంతోె ఐపీఎల్ ను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అన్ని రంగాలపై కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూతబడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంది. దేశంలో కరోనా మరణాలు ఇప్పటికే వంద దాటడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news