ఏపీలో మళ్ళీ మంత్రివర్గంలో మార్పులపై చర్చ మొదలైంది..గత రెండు నెలల ముందు మంత్రివర్గం గురించి పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే.. రెండున్నర ఏళ్లలో మళ్ళీ కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని జగన్ చెప్పిన సంగతి తెలిసిందే…అంటే గత ఏడాది డిసెంబర్‌కు రెండున్నర ఏళ్ళు అయ్యాయి…దీంతో అప్పుడే మంత్రివగ్రంలో మార్పులు జరుగుతాయని అంతా అనుకున్నారు…అలాగే పదవులు ఆశించే ఎమ్మెల్యేలు ఎంతో ఆతృతతో…మంత్రివర్గంలో ఉన్న వారేమో పదవులు పోతాయేమో అనే టెన్షన్‌లో ఉండిపోయారు.
కానీ అప్పుడు ఏం జరిగిందో గాని మంత్రివర్గంలో మార్పులు జరగలేదు…మళ్ళీ రెండు నెలల తర్వాత..ఇప్పుడు మంత్రివర్గం గురించి చర్చలు నడుస్తున్నాయి…అతి త్వరలోనే జగన్ మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే కరెక్ట్‌గా ఎప్పుడు జరుగుతుంది…ఎంతమందిని తప్పించి, ఎంతమందిని కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే అంశం క్లారిటీ లేదు.
కాకపోతే మంత్రివర్గానికి సంబంధించి కొన్ని ఊహాగానాలు అయితే మొదలయ్యాయి..పూర్తిగా మంత్రివర్గంలో మార్పులు చేయకుండా కొందరిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెడ్డి వర్గానికి చెందిన మంత్రులని కొనసాగిస్తారా? లేదా? అనే చర్చ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఎందుకంటే రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు నలుగురు…జగన్‌తో సన్నిహితంగా ఉండేవారే..పైగా వారు తమ శాఖలకు సంబంధించి బాగానే పనిచేస్తున్నారు.
అటవీ,విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్ బంధువే…మరి ఈయనని మంత్రివర్గం నుంచి తప్పిస్తారో లేదో చెప్పలేం. అటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అలాగే జగన్‌తో సన్నిహితంగా ఉంటారు. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు. ఆర్ధిక శాఖని బుగ్గన కాకుండా మరొకరు నిర్వహించడం చాలా కష్టం. ఆయన మేనేజ్ చేసినట్లు మరొకరు చేయలేరు.
ఇక ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గురించి చెప్పాల్సిన పని లేదు…ఈయన ఇంతవరకు ఎలాంటి వివాదం లేకుండా పనిచేస్తూ వస్తున్నారు. మరి ఈ నలుగురు రెడ్డి మంత్రులని జగన్ మారుస్తారో లేదో చూడాలి.