
ది హైదరాబాద్ కేంద్ర సహకార బ్యాంక్‌లో నూతనంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 52 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానున్నదని.. 45 స్టాఫ్ అసిస్టెంట్, 7 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.