శీతాకాలం లో ఈ కొన్ని ప్రదేశాలని చూడడం చాల బాగుంటుంది. కుటుంబ సమేతంగా వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు. మన భారత దేశం లో వింటర్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే.. మరి వీటిని ఒక లుక్ వేసేయండి. వివరాల్లోకి వెళితే..
మనాలీ, హిమాచల్ ప్రదేశ్:
మనాలీ, హిమాచల్ ప్రదేశ్ చూడడానికి ఎంతో బాగుంటుంది. మంచు పర్వతాలు పర్యాటకులని బాగా ఆకట్టుకుంటాయి. ఢిల్లీ నుండి మాత్రమే కాకుండా వివిధ ప్రదేశాల నుండి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు.
ధనౌత్లి , ఉత్తరాఖండ్
ఇది తెహ్రీ జిల్లాలో ఉంది. ఇక్కడ దట్టమైన మంచు, ప్రకృతి అందరిని ఆకర్షిస్తుంది. ఇక్కడ అడవులు సైతం ఎంతో మనోహరంగా ఉంటాయి. దీనిని చూడాలంటె డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఎప్పుడైనా సందర్శించొచ్చు.
లంబసింగి , ఆంధ్రప్రదేశ్
లంబసింగి కూడా చూడాల్సిన ప్రదేశం. విశాఖపట్టణం లోని చింతపల్లి లోని కొండల్లో ఉన్న లంబసింగిని చూడడానికి దూర ప్రాంతాల నుండి కూడా వస్తూ ఉంటారు. ఇది మొదట ఒక చిన్న గ్రామం. కానీ ఇప్పుడు ఇది ఎంతో మందికి ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. స్ట్రాబెర్రీస్ తోటలు కనువిందు చేస్తాయి. ఇక్కడ పచ్చదనం ఎంతో ఆహ్లాదంగా, రమణీయంగా ఉంటుంది. అలానే జలపాతాలు కూడా ఇక్కడ చూడ దగ్గవి.
అల్మోరా , ఉత్తరాఖండ్
పైన్స్, ఓక్స్ చెట్లు ఇక్కడ అద్భుతంగా ఉంటాయి. నందా దేవి, చిటై దేవాలయాలు ప్రముఖంగా ఉన్నాయి. వీటిని కూడా చూడాల్సిందే. 200 ఏళ్ల పురాతన లాలా బజార్ కూడా ఎంతో ఫేమస్. ఇక్కడకి కనుక వెళితే దీనిని మాత్రం మరచిపోకండి. హిమాలయ పర్వతాలు, ప్రకృతి అందాలు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తవాంగ్, నైనిటాల్, మన్సియారీ, ఔలీ, డార్జిలింగ్ కూడా వింటర్ లో చూడాల్సినవే.