సుకన్య సమృద్ధి యోజన పథకం తీసుకోనేవారు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!!

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలలో ఒకటి సుకన్య సమృద్ధి పథకం.. ఈ పథకం ద్వారా అమ్మాయిల భవిష్యత్తు కోసం డబ్బులను పొదుపు చేయవచ్చు… ఈ పథకం కింద 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయి పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంకు/పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.అమ్మాయికి 21 ఏళ్లు వచ్చే వరకు లేదా 18 ఏళ్ల తర్వాత వివాహం జరిగినా ఖాతాను ముగించవచ్చు. అయితే, అమ్మాయి 18 ఏళ్ల తర్వాత సొంతంగా ఖాతాను నిర్వహించుకోవచ్చు.

పెట్టుబడులు దీర్ఘకాలికంగా మంచి లాభాన్ని అందిస్తాయి. ఈ పథకం వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతీ త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేటు సంవత్సరానికి 7.60%గా నిర్ణయించారు. ఇది ఇతర ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్ల కన్నా కూడా ఎక్కువే..అధిక వడ్డీ రేటుతో పాటు సెక్షన్ 80సీ కింద సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఉంది.ఇకపోతే సంవత్సరానికి కనీసం రూ. 250 డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ పరిమితి ఏడాదికి రూ. 1.50 లక్షలు. అయితే, ప్రతి ఏడాది కనీసం రూ. 250 మదుపు చేయడం తప్పనిసరి..

అమ్మాయి 18 ఏళ్లు పైబడిన తర్వాత లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఎందుకంటే ఉన్నత విద్యకు సంబంధించి ఖర్చులకు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధికి ముందు, ఆర్ధిక సంవత్సరం చివరిలో ఖాతాలో ఉన్న నగదు నిల్వలో 50% మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది..
ఈ ఖాతాను పోస్టాఫీసు లేదా పబ్లిక్/ప్రైవేట్ రంగ బ్యాంకులో సుకన్య సమృద్ధి యోజన (SSY) ధరఖాస్తు ఫారం పూర్తి చేసి ఇవ్వవచ్చు. ధరఖాస్తు ఫారమ్‌తో పాటు తల్లిదండ్రుల/సంరక్షకుల ఆధార్, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్ లైసెన్స్‌, ఓటరు ఐడీ ఏదైనా ఒక గుర్తింపు పత్రాన్ని కేవైసీగా సమర్పించాలి. అమ్మాయి జనన ధృవీకరణ పత్రం జిరాక్స్ కాపీని సమర్పించాలి..

ఫారమ్ లో పొందుపరచాల్సిన వివరాలు..

  • అమ్మాయి పేరు.
  • ఖాతా తెరిచే తల్లిదండ్రులు/సంరక్షకుల పేరు.
  • ప్రారంభ డిపాజిట్ మొత్తం.
  • అమ్మాయి పుట్టిన తేది, అమ్మాయి జనన ధృవీకరణ పత్రం (అందులో సర్టిఫికేట్ నంబర్‌, జారీ చేసిన తేది మొదలైనవి ఉండాలి).
  • తల్లిదండ్రుల/సంరక్షకుల గుర్తింపు పత్రం (ఆధార్‌)
  • ప్రస్తుత, శాశ్వత చిరునామా
  • తల్లిదండ్రుల / సంరక్షకుల పాన్ నెంబరు

గుర్తుంచు కొవాల్సిన ముఖ్యమైన విషయాలు..

ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిల కోసం వేర్వేరుగా ఖాతాలను తెరవొచ్చు.

అమ్మాయి ఎన్ఆర్‌ఐ అయినట్లయితే, లేదా ఆమె భారత పౌరసత్వాన్ని కోల్పోయినా ‘SSY’ ఖాతా మూసివేస్తారు.

‘SSY’ పై రుణం తీసుకోలేరు.
ఈ ఖాతా వడ్డీ రాబడిపై పన్ను లేదు.
ప్రాణాంతక అనారోగ్యం, ప్రాథమిక ఖాతాదారుడు (అమ్మాయి) మరణించడం వంటి కారణాలతో ఖాతాను గడువుకు ముందే మూసివేయవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news