సీఎం జగన్ చేతగానితనంతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ.గురు, శుక్రవారాల్లో పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు వెళ్లనున్నారనీ తెలియజేశారు.గోదావరి వరదలో చిక్కుకున్న బాధితులకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారనీ తెలిపారు.ఇప్పటికే అన్ని ఏర్పాట్లను భువనేశ్వరి పూర్తి చేశారనీ,పండ్లు, ఫలాలు, తినుబండారాలు, మంచినీళ్లు సిద్ధం చేశామని అన్నారు.
సీఎం చేతకానితనం, అసమర్థతతో వేలాది కుటుంబాలు గోదావరి ముంపులో చిక్కకున్నాయనీ మండిపడ్డారు.ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన పోలవరాన్ని జగన్ ప్రభుత్వం వరదలో ముంచేసి చారిత్రాత్మక తప్పిదం చేసిందన్నారు.దీనిపై 48గంటల్లో వివరణ ఇవ్వకుంటే ప్రభుత్వం తన తప్పిదాలను ఒప్పుకున్నట్లేనని అన్నారు.దీనిపై ముఖ్యమంత్రి జాతి ప్రజలకు సమాధానం, క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ చేశారు.నాలుగు రోజులుగా వరదల్లో ఉన్న బాధితుల వద్దకు ఏ ఒక్క అధికారి, ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి ఎవరూ వెళ్లకపోవడం దుర్మార్గమన్నారు.ఇప్పటికైనా స్పందించి బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.