అన్నదాతలకు గుడ్ న్యూస్.. రూ. 3 లక్షలు ఆర్థిక సాయం..!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. అయితే మరో కొత్త పథకాన్ని కేంద్రం రైతుల కోసం తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు తో ఈ కొత్త పథకం ని తీసుకు రావడం జరిగింది. రైతులు రూ. 3 లక్షల వరకు ప్రయోజనం ని కేంద్రం కల్పిస్తోంది. చాలా మంది రైతులు ఆవులు, గేదె, మేకలు, చేపలు వంటి వాటిని పెంచుతున్నారు.

అలాంటి వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆవులు, గేదె, మేకలు, చేపలు వంటి వాటి పెంపకం సాగిస్తున్న రైతులకి ప్రభుత్వం పశు కిసాన్‌ క్రెడిట్ కార్డులను ఇస్తోంది. పాలు, పాల ఉత్పత్తులు, మాంసం కొరతను తీర్చాలని కేంద్రం ఈ పధకాన్ని ప్రవేశ పెట్టింది.

ఇక పశు కిసాన్‌ క్రెడిట్ కార్డులను ఎవరు పొందొచ్చు అనేది చూస్తే… పీఎం కిసాన్‌ ఉపయోగించుకుంటున్న వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఆవులు, గేదె, మేకలు, చేపలు వంటి వాటి పెంపకం సాగిస్తున్న రైతులకి ఈ కార్డు ఇస్తారు. 7 శాతం వడ్డీకే రూ. 3 లక్షల వరకు రుణం దీని ద్వారా వస్తుంది. ఏడాదిలోపు రుణం చెల్లించే వారికి అదనంగా సబ్సిడీ సైతం అందిస్తారు. ఐదేళ్లలో లోన్ చెల్లించాలి.

ఎలా లోన్ తీసుకోవాలి..?

కార్డు కోసం దగ్గర లో బ్యాంక్ కి వెళ్ళాలి.
దరఖాస్తు ఫామ్‌ తీసుకోవాలి.
ఆ తరవాత సంబంధిత వివరాలను ఎంటర్ చెయ్యాలి.
కేవైసీ కోసం కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలి.
15 రోజులలోపు కిసాన్‌ క్రెడిట్ కార్డును ఇస్తారు.
ఆధార్డ్ కార్డ్‌, జంతవుల ఆరోగ్య ధృవీకరణ పత్రం, ఓటర్‌ ఐడి, బ్యాంకు ఖాతా, భూమి డాక్యుమెంట్స్‌ ని ఇవ్వాలి.
అలానే పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడా సబ్మిట్ చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news