గుడ్ న్యూస్ : తెలంగాణకు మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు

-

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వేలకు ఖర్చు పెట్టేందుకు కేంద్ర ఉత్సాహంగా ఉన్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే నిధులు పెంచుతామని ఆయన వివరించారు. రైలు చార్జీలు పెంచే యోచన తమకు లేదని క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు యువజన లో కేంద్ర ప్రభుత్వం ఉందని కీలక ప్రకటన చేశారు మంత్రి అశ్విని వైష్ణవి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉపాధితో పాటు ప్రజల కష్టాలు కూడా తగ్గుతాయని వివరించారు. హైదరాబాద్ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు రాజధాని, దూరంతో రైళ్ల మంజూరు విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే మేధా సర్వీస్ సిస్టమ్ కి పెద్ద ఆర్డర్ ఇచ్చామని.. అయితే కాజీపేటలో భూ కేటాయింపు లేట్ అయినట్లు ఆయన అన్నారు. కాజీపేటలో పిరియాడిక్ ఓవరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామని.. త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు చేపడుతాం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news