కేటీఆర్‌ అరెస్ట్‌కు ముహూర్తం ఖరారు.. వేణుస్వామి మరో సంచలన ప్రిడిక్షన్

-

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తల జీవితాల్లో చోటుచేసుకునే కీలక పరిణామాలను ముందుగానే చెబుతూ ఆయన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంటారు.ఇప్పటివరకు ఇయన చెప్పిన జ్యోతిష్యాల్లో 80 శాతానికి పైగా నిజమయ్యాయని ఆయన ఫ్యాన్స్ చెబుతుంటారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేణుస్వామి తాను ముందే చెప్పినట్లుగా కేటీఆర్ ఈ ఏడాదే తప్పకుండా అరెస్ట్ అవుతారని నొక్కి చెప్పారు. అయితే ఏ కేసులో అరెస్ట్ అవుతాడో మాత్రం చెప్పలేదు.ఈ వార్త విన్న బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోయింది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉండగా.. కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నామని అంటున్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కీలక నేతలంతా కష్టకాలంలో బీఆర్ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version