ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనుకున్నది సాధించాలి. అప్పుడే జీవితానికి అర్థం. చాలామంది జీవితాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా సాధించాలి అని తెలిసినా శ్రద్ధ పెట్టరు. కనీసం మొదట దానిని మొదలు పెట్టరు కూడా.
పైగా ఏదైనా మంచి పని చేయాలంటే మంచి సమయం కోసం ఎదురు చూస్తూ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అయితే నిజానికి మనం దేనిలోనైనా విజయం సాధించాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నమే విజయానికి మొదటి అడుగు.
అదే విధంగా సరైన ప్లానింగ్ ఉండాలి. కానీ చాలామంది ఎవరికైనా సాయం చేయాలన్న ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా సమయం చూసుకొని మొదలుపెడతామని అనుకుంటూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుంది అంటే చేయాల్సిన పనిని మర్చిపోతుంటారు.
పనులను ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు:
మంచి సమయంలో మొదలు పెట్టాలని లేదంటే ఇంకా బాగా చేయాలని చాలా మంది వాయిదా వేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా అలా చేయకండి. నిజానికి సమయం చాలా విలువైనది. వెళ్ళిపోయిన సమయం తిరిగి మళ్ళీ రాదు. అందుకని ఉన్న సమయంలో మనం అనుకున్నది పూర్తి చేయాలి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
సందేహం వద్దు:
ఈ పని చేస్తే ఏమవుతుంది ఓడిపోతానేమో అని చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ నిజానికి అలా వెనకకి వచ్చేయడమే ఓడిపోవడం. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే కనీసం ప్రయత్నమైనా చేస్తారు అంతేకానీ వెనకడుగు వేసి భయపడరు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి.
అనుకున్నప్పుడే అనుకున్న పనులు చేసేయండి:
ఎవరి కోసం కానీ మంచి సమయం కోసం కానీ చూడకండి మీకు ఎప్పుడు ఏం చేయాలి అనిపిస్తే అప్పుడు మొదలు పెట్టండి. నిజానికి ఆలస్యం చేయడం కంటే కూడా అనుకున్నప్పుడు చేయడమే మంచిది కాబట్టి వాయిదా వేయకుండా చక్కగా మంచి ఐడియా తో ముందుకు వెళ్లి విజేత అవ్వండి