వంటగది ఒక మాయాప్రపంచం. అందులోకి వెళ్తే.. చేసేకొద్ది పని వస్తూనే ఉంటుంది. అస్సలు తెమల్దే.. మనకా బోలెడు పంచాయతీలు. ఫాస్ట్ గా ఏదో ఒకటి చేసుకుని ఆఫీసులకు, కాలేజీలకు పరుగులు తీయాలి. వంటగది క్లీన్ గా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ అదేంటో..ఏ చిన్న వంట చేసినా.. వంటగది అంతా ఆగం ఆగం చేస్తారు కొందరు. ఇక వంటచేయడంలో అనుభవం లేనివారికి అదేదో వింతప్రపంచంలా కనిపిస్తుంది. కొన్ని టిప్స్ పాటించడం వల్ల వంటగదిలో టైం సేవ్ అవుతుంది. మరికొన్ని చిట్కాల ద్వారా కిచెన్ క్లీన్ గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ అవేంటో చూసేద్దామా..!
పప్పు త్వరగా ఉడకాలంటే అందులో చిన్న కొబ్బరి ముక్క వేయండి.
ఏవైనా పండ్లు త్వరగా మగ్గాలంటే.. వాటిని ఓ న్యూస్ పేపర్‌లో చుట్టి.. బియ్యం డబ్బాలో పెట్టాలి.
ఇక పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే.. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలు.
చాలామంది పచ్చిబఠానీ వాడలని ఉంటుంది కానీ.. అవి అప్పటికప్పుడు తెచ్చుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే.. ఊరికే బూజుపట్టేస్తాయి. అలా కాకుండా..పచ్చి బఠాణి ఏడాదిపాటు నిల్వ ఉండాలంటే.. వాటిని ఓ వస్త్రంలో మూటకట్టి ముందుగా వేడినీళ్లలో 3 నిమిషాలపాటు.. మరో మూడు నిమిషాలపాటు చల్లటి నీళ్లలో ముంచాలి. తర్వాత ఎండలో ఆరబెట్టి, వాటిని గాలి వెళ్లని డబ్బాలో వేసి.. ఫ్రీజ్‌లో పెడితే సరి..
తేనెలో నాలుగు మిరియం గింజలు వేస్తే.. చీమలు చేరవు.
అగరబత్తి వెలిగించిన తర్వాత రాలే బూడిదతో ఇత్తడి పాత్రలు తోమితే తళతళలాడుతాయి.
లడ్డూలని ఓ అర నిమిషం మైక్రోవేవ్‌లో ఉంచి తీస్తే తాజాగా ఉంటాయి.
బిర్యానీ చేసేటపుడు బియ్యం కడిగిన తర్వాత అందులో కొద్దిగా నెయ్యి వేస్తే అన్నం పొడిపొడిగా వస్తుంది.
వంటగదిలో ఈగలు వంటివి రాకుండా ఉండటానికి రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లు వేసి, టేబుల్ స్పూన్ ఉప్పు కలిపి కిచెన్ ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తే కింద ఏదైనా నూనె, ఇతర పదార్థాల వల్ల ఏర్పడిన మొండి మరకలు క్లీన్ అవుతాయి.
ఈ చిన్న చిన్న టిప్స్ వాడి మీ ఎనర్జీ, టైం సేవ్ చేసుకోండి మరీ..!