పెసర పంటలో తెగుళ్ల నివారణకు ఇలా చేయండి..!

-

తెలుగు రాష్ట్రాల్లో.. పెసర సాగు విరివగా ఉంది.. మాగాణి భూముల్లో, వేసవిలో మూడవ పంటగా కూడా పెసర సాగు వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో అంతర పంటగా దీనిని ఎంచుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పెసర సాగుతో అదనపు అదాయాలు పొందవచ్చు.. అయితే పెసర సాగులో తెగుళ్ల విషయంలో కాస్త అవగాహన కలిగి ఉండాలి.. ఎలాంటి తెగులుకు ఎలాంటి నివారణ పద్థుతులు వాడాలో ఈరోజు చూద్దాం.

పెసరలో తెగుళ్లు.. వాటి నివారణ చర్యలు

బూడిద తెగులు : ఈ తెగులు విత్తన 30-35 రోజులు తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు. ముదురు ఆకులపై , బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన , క్రింద భాగాలకు, కొమ్మలు , కాయలకు వ్యాపిస్తుంది.
నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కర్బండిజం లేదా 1 గ్రాము తయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లి. కేరాథెన్ లేదా 1 మి.లి హెక్సాకొనజొల్ లేదా 1.మి.లి ట్రైడిమర్ఫ్ లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
ఆకుపచ్చ తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి కూడా. ఫలితంగా. కాయల్లో గింజలు సరిగా నిండవు .
నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మంకోజేబ్ లేదా 2 గ్రా . క్లోరోథాలోనిల్ లేదా 1 గ్రాము కార్బండజిమ్ లేదా 1 గ్రాము థాయోఫనేట్ మిథైల్ లను కలిపి వాడటం ద్వారా ఆకుపచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును నివారించవచ్చు.
కోరినోస్పోర ఆకుపచ్చ తెగులు : ఈ తెగులుస వల్ల పెసర ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమరంగు మచ్చలు ఏర్పడి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఈ తెగులు 30-35 రోజుల పంటకు వ్యాపిస్తుంది..
దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ 3 గ్రా లేదా మంకోజబ్ 2.5 గ్రా లీటరు నీటికి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.
బాక్టిరియల్ బ్లైట్ : ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. 1 గ్రా. పౌషామైసిన్ ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిముషాలు నానబెట్టి విత్తాలి . ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా . కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటో మైసిన్ ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి .
ఎల్లోమోజయిక్ తెగులు : ఇది వైరస్ జాతికి సంబంధించిన తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు , కాయలు మిద పసుపు పచ్చ పొడలు ఏర్పడతాయి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లి. మొనోక్రోటోఫాస్ లేక 2 మి.లి డైమితోఎట్ మందును పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు. ఎమ్.ఎల్.267 , ఎల్.జి.జి. 407 ,డబ్ల్యు.జి.జి. 37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి.తెల్లదోమ ఉధృతిని వెంటనే అరికట్టాలి.
ఆకుముడత తెగులు: తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు పాకుతుంది.. తెగులు ఆశించిన మొక్కలు ఆకులు అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారిపోయి రాల్తాయి.. ఆకుల అడుగుభాగంలోని ఈ నెలు రక్తవర్నాన్ని పోలి ఉంటాయి.
లేత దశలో వ్యాధి సోకినా మొక్కలను పికి తగులబెట్టడం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు .నివారణకు లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మీ.లీ డైమితోయేట్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి.-295 యల్.జి.జి.- 460 , పెసర రకాలు , టి- 9 , యల్.జి.జి. – 20 మినుము రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news