పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచాలా..? అయితే ఇలా చేస్తే సరి..!

-

అందరి జ్ఞాపకశక్తి ఒకేలా ఉండదు. కొందరిలో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటే కొందరిలో జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. నిజానికి జ్ఞాపక శక్తి ఎక్కువగా లేకపోతే పిల్లలు చదివినది మర్చిపోతుంటారు. కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచడం చాలా అవసరం. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచాలని మీరు అనుకుంటే కచ్చితంగా ఈ ఆహార పదార్థాలను చేర్చండి. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

గుడ్లు:

గుడ్లు పెట్టడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గుడ్లను బ్రేక్ ఫాస్ట్ కింద కానీ లేదంటే మీరు ఉడికించిన గుడ్లను ఇవ్వడం కానీ చెయ్యచ్చు. ప్రోటీన్ లోపం కూడా దీని వలన ఉండదు.

చేపలు:

చేపలు వలన కూడా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సాల్మన్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ ని షార్ప్ గా మారుస్తాయి.

బీన్స్:

బీన్స్ ని తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది బీన్స్ లో ప్రోటీన్స్ మినరల్స్ చాలా అధికంగా ఉంటాయి. కార్బొహైడ్రేట్స్ కూడా ఉంటాయి.

ఓట్స్:

ఓట్స్ వలన కూడా జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు ఇది కూడా పిల్లల యొక్క మెమరీ ని షార్ప్ గా మారుస్తుంది.

పల్లీలు:

పల్లీలు వలన కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. మీరు పల్లీలను తీసుకోవచ్చు లేదంటే పీనట్ బటర్ ని అయినా తీసుకోవచ్చు.

పండ్లు, పాలు:

పండ్లు, పాలు. కూరగాయలు కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ముఖ్యంగా టమాటా, స్వీట్ పొటాటో, క్యారెట్, పాలకూర ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తిని పెంచుతాయి అలానే స్ట్రాబెరీ ఆరెంజ్ ఇవన్నీ కూడా పిల్లల యొక్క మెమరీ ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి వాళ్ళకి డైట్ లో ఇవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news