ఈ టిప్స్ ని బోర్డు ఎగ్జామ్స్ వ్రాసే వాళ్ళు ఫాలో అయితే.. విజయం మీదే..!

-

పరీక్షలంటే నిజంగా చాలా మంది భయపడుతుంటారు. పరీక్ష తేది దగ్గర పడుతుండటంతో తెగ టెన్షన్ పడి పోతూ ఉంటారు విద్యార్థులు. అయితే మీరు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా…? మంచి మార్కులు రావాలని కష్టపడుతున్నారా..? అయితే మీకోసం కొన్ని టిప్స్. ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచిగా స్కోర్ చేయడానికి అవుతుంది.

మీరు సిలబస్ చదవడానికి సరైన ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి అలానే టైం ని కూడా మీరు దృష్టి లో పెట్టుకుని ప్రిపేర్ అవుతూ ఉండాలి. అలా ఒకటే టాపిక్ ని పట్టుకుని ఉంటే టైం అలా కదిలిపోతుంది. అందుకోసమే అలంటి ఇబ్బంది వుండకూడదంటే ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.

వీటిని కనుక మీరు ఫాలో అయితే కచ్చితంగా సక్సెస్ అవ్వొచ్చు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ టిప్స్ గురించి చూసేయండి. ఈ విధంగా మీరు చదువుకుంటే ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి.

ఫ్లాష్ కార్డ్స్:

మీరు సులభంగా కాన్సెప్ట్ ని గుర్తు పెట్టుకోవడం కోసం ఫ్లాష్ కార్డ్ ని ఉపయోగించవచ్చు. దీనిని ఉపయోగించి మీకు మీరుగా టెస్ట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక కాగితం తీసుకుని దాని మీద ఒక అంశాన్ని రాయండి ఆ తర్వాత వెంటనే పేపర్ వెనుక దానికి సంబంధించి పూర్తి వివరాలు రాయండి. ఇలా సాధన చేయడాన్ని ఫ్లాష్ కాన్సెప్ట్ అంటారు. దీంతో మీరు రీ కలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిగా స్కోర్ చేయడానికి అవుతుంది.

ఫాన్ మాన్ టెక్నిక్:

క్లిష్టమైన భావాలను అర్థం చేసుకోవడానికి ఈ ట్రిక్ మీరు ఉపయోగించవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ సబ్జెక్టుని మీరు విడగొట్టి ఎక్కడైతే అర్థం కావడం లేదో అక్కడ గుర్తించి వాటిని పరిష్కరించడమే ఫ్యాన్ మాన్ టెక్నిక్.

మైండ్ మ్యాపింగ్:

మైండ్ మ్యాపింగ్ కూడా మీకు మంచి స్కోర్ చేయడానికి అవుతుంది. మీరు చదువుకునే సబ్జెక్ట్ ని విజువల్ రూపంలో గుర్తుంచుకోవడమే మైండ్ మ్యాపింగ్ మూడు నుండి ఆరు నెలల పాటు మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ని ఉపయోగించడం వల్ల బాగా గుర్తుంటాయి. అలానే బోర్డ్ ఎగ్జామ్స్ లో బాగా స్కోర్ చేయడానికి కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది.

కార్నెల్ నోట్‌టేకింగ్ సిస్టమ్:

ఇది కూడా చక్కగా మీకు స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది దీనివల్ల మరోసారి సమాచారాన్ని గ్రహించడానికి, రివైజ్ చేయడానికి అవుతుంది విద్యార్థులు స్వయంగా వాళ్ళని వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు.

ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్:

ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది ఉండాలి. వర్క్ లోడ్ పెరిగి మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. కనుక వీటిపై సరిగ్గా దృష్టి పెడితే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news