Women’s Health : మహిళలూ మీ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారా..?

-

ఇంట్లో మహిళలు కుటుంబం మీద పెట్టిన శ్రద్ధ తమ మీద పెట్టరు. ఇంట్లో వాళ్లందరికి ఏం కావాలో అది క్షణాల్లో చేసిపెట్టి వారి కోసం తపించే ఆడవాళ్లు.. వాళ్లకేం కావాలో కూడా ఆలోచించుకోరు. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే మరీనూ. అయితే గృహిణులైనా, ఉద్యోగినులైనా.. ఇంటి బాధ్యతలు నెరవేర్చడంతో పాటు తమ గురించి కూడా పట్టించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే అనారోగ్యంబారిన పడే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు. దీనికోసం రోజులో కొంత సమయంలో మీకు కేటాయించుకోవాలని చెబుతున్నారు.

మీ ఫ్యామిలీ మెంబర్స్​కి సమయానికి అన్ని సమకూర్చుతారు. కానీ మీరు మాత్రం కనీసం టైంకి తినరు. పిల్లలు మిగిల్చారనో.. పాడైపోతాయనో మిగిలిన ఆహారాన్ని తినేస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ కాదు. అందరి గురించి ఆలోచించే మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ముఖ్యంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తినే సమయాల్ని కచ్చితంగా పాటించండి. గంటకోసారైనా నీరు తాగేలా నియమం పెట్టుకోండి.


అందరికంటే ఆలస్యంగా పడుకోవడం.. అందరికంటే ముందుగా నిద్రలేవడం ప్రతి ఇంట్లో మహిళ దినచర్యే. అయితే ఎన్ని పనులున్నా వీలైనంత త్వరగా పడుకోవడానికి ట్రై చేయండి. కనీసం రోజుకు 7 గంటలైనా నిద్రపోయేలా ప్లాన్ చేస్కోండి. నిద్ర సరిగ్గా పోతే.. రోజులో ఎంత పనిచేసినా ఆరోగ్యానికి ఎక్కువగా ఎఫెక్ట్ పడదు.


టైం కాని టైంలో, సెలవుల్లోనూ ఉద్యోగినులు పనిచేస్తుంటారు. తప్పనిసరైతే ఓకేగాని ప్రతిసారి అలాగే కొనసాగించొద్దు. ప్రతి ఒక్కరికి విశ్రాంతి అవసరం. ఆఫీసు టైం దాటి పని చేయడం మానండి. వేళ దాటిన తర్వాత పని చేయడం కుదరదని కరాఖండీగా చెప్పేయండి.


రోజూ ఇంట్లోనే ఉంటావుగా అని చాలా మంది మగాళ్లు, పిల్లలు ఈజీగా అనేస్తారు. కానీ వాళ్లు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది గమనించరు. అందుకే మహిళలూ.. ఎవరేం అన్నా.. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా.. మీ గురించి మీరు పట్టించుకోండి.. మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధపెట్టండి.. మీ కోసం సమయం కేటాయించుకుని.. మీకు నచ్చిన పనులు చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news