ఎల్ఐసీ పాలసీదారులకు గుడ్ న్యూస్..వాటిపై భారీ తగ్గింపు..

-

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలకు భయం పట్టుకుంది.. దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం ఎక్కువైంది.. ఈ మేరకు భారతీయ అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ ను చెప్పింది.ప్రీమియం చెల్లించకపోవడం కారణంగా నిలిచిపోయిన పాలసీ పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా పాలసీలను మళ్లీ పునరుద్ధరించు కోవడానికి మరో అవకాశం కన్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

పాలసీలను రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది ఎల్ఐసీ. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఎల్ఐసీ. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది..’స్పెషల్‌ రివైవల్‌ క్యాంపెయిన్‌’లో అన్ని నాన్‌ యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ పాలసీలను రాయితీతో ఆలస్య రుసుము చెల్లించి మళ్ళీ కొనసాగించుకోవచ్చని సంస్థ వెల్లడించింది..

ప్రీమియం మొత్తం చెల్లించని తేదీ నుంచి నుంచి ఐదేళ్లలోపు పాలసీలను రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొంది. రూ. 1,00,001 నుంచి రూ. 3 లక్షల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే కూడా ఆలస్య రుసుములో 25 శాతం తగ్గింపు కూడా వస్తుంది.. ఇది ఇలా ఉండగా రూ. 3,00,001 లేదా ఆపై ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలకు ఆలస్య రుసుములో 30 శాతం తగ్గింపు ఉంటుంది. అయితే.. గరిష్టంగా రూ. 3500 వరకు తగ్గింపు ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది.

ఇకపోతే మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలు అయితే,లేట్ ఫీజు ఉండదని తెలిపింది ఎల్ఐసీ. వివిధ కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రిమియం చెల్లించని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పాలసీలను తిరిగి కొనసాగించుకోవచ్చని తెలిపింది.. ఇప్పటికే ఎల్ఐసీలో ఎన్నో పథకాలు అందుబాటు లో ఉన్నాయి.. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభించింది.భవిష్యత్ లో మరిన్ని పథకాలను కూడా అందించనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news