తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తృటిలో పెను ప్రమాదం…!

-

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆక్సిజన్ నిల్వలు తగ్గాయి. తెల్లవారుజమున 4గంటలకు స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు గ్యాస్ ఆపరేటర్స్ సమాచారం ఇచ్చారు. వెనువెంటనే కలెక్టర్ కి వెంగమ్మ ఫోన్ చేశారు. చెన్నై నుంచి ట్యాంకర్ మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ చేసి… ఏర్పేడు శ్రీకృష్ణ గ్యాస్ ఏజెన్సీస్ ని ఆక్సిజన్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఏర్పేడు ప్లాంట్ కి మాత్రమే ట్యాంకర్ వెసులుబాటు ఉంటుంది. అర్బన్ ఎస్పీ వెంకటఅప్పల నాయుడు కి ఫోన్ చేసిన వెంగమ్మ… పరిస్థితి వివరించారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులు ప్రాణాలు కాపాడారు. ప్రోటోకాల్ తో ట్రాఫిక్ లేకుండా పోలీస్ వాహనాల్ తో ఆక్సిజన్ స్విమ్స్ కి తరలించారు. 25నిమిషాల్లో ఏర్పేడు నుంచి స్విమ్స్ కి ట్యాంకర్ వచ్చింది. ఆక్సిజన్ ను స్టోరేజ్ ట్యాంక్ లో నింపడటంతో కలెక్టర్, ఎస్పీ ఊపిరి పీల్చుకున్నారు. రుయా ఘటన నేపథ్యంలో స్విమ్స్ లో సినిమా ను తలదన్నే హై డ్రామా చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news