కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే సులభంగా వీటిని చేసుకు తాగండి..!

-

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలు కిడ్నీ సమస్యలు ఒకటి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ల తో ఇబ్బంది పడుతున్నారు. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా, కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలన్నా ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి.

kidney-stones

మనిషికి ఉండే ఆక్టివ్ ఆర్గాన్స్ లో కిడ్నీ ఒకటి. ఇది రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఒంట్లో ఉన్న వ్యర్ధ పదార్థాలను బయటకు పంపిస్తుంది. అయితే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అనుసరించండి. దీనితో కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.

పసుపు టీ :

పసుపు బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కిడ్నీలని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూసుకుంటుంది. ఒక గ్లాసు వేడి నీళ్ళలో ఒక టీస్పూన్ పసుపు వేసి పది నిమిషాల పాటు మరిగించి అందులో కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం వేసుకుని తీసుకుంటే మంచిది.

అల్లం:

అల్లం లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద మందులు కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అల్లాన్ని తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. అలానే కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లయితే ముక్కలు కింద విరిగిపోవడం జరుగుతుంది. దీనితో యూరిన్ ద్వారా ఆ రాళ్ళు బయటికి వచ్చేస్తాయి.

బీట్రూట్ జ్యూస్:

బీట్రూట్ జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కిడ్నీలను శుభ్రంగా ఉంచుతుంది. కిడ్నీల ఆరోగ్యానికి ఇది బాగా మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. స్టోన్ ఫార్మేషన్ ని ఇదీ తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఇందులో సిట్రిక్ ఉంటుంది. ఇది కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. వీటిని మీరు అనుసరిస్తే తప్పకుండా ఈ సమస్య బారిన పడకుండా ఉండొచ్చు. అలానే ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండటం, బీపీ ని కంట్రోల్ లో ఉంచుకోవడం, డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుకోవడం, బరువుని అదుపులో ఉంచుకోవడం, మంచి జీవన విధానాన్ని పాటించడం లాంటివి చేస్తే తప్పకుండా ఇటువంటి సమస్యలు ఉండవు దీనితో ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news