ఇవాళ మళ్లీ కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నిన్న జగిత్యాల వెళ్లిన కేసీఆర్.. మరోసారి ఉమ్మడి కరీంనగర్ పయనం కానున్నారు. మాజీ మేయర్ రవిందర్ సింగ్ కూతురు వివాహ వేడుకకు హాజరు కానున్నారు సీఎం కేసీఆర్. ప్రత్యేక హెలిక్యాప్టర్ పైన కరీంగనర్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్.. మాజీ మేయర్ రవిందర్ సింగ్ కూతురు వివాహ వేడుకకు హాజరు అయిన తర్వాత.. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ పనులు పరిశీలించనున్నారు.
కాగా, నిన్న జగిత్యాలలో పర్యటించిన కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ పేర్కొన్నారు కేసీఆర్. ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధమని ప్రకటించారు కేసీఆర్. మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు.