భారీగా పెరిగిన బంగారం…!

-

గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేసాయి. దేశీయంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయడంతో స్వల్పంగా బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర… పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.750 పెరిగింది.

దీనితో రూ.42,670కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరుగుదలతో రూ.39,090కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా రూ.750 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరగడంతో… రూ.39,900కు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.750 పెరిగింది.

దీనితో 10 గ్రాముల బంగారం ధర రూ.41,100కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర రూ.510 ప్రగాడంతో రూ.40,500కు చేరింది. అంతర్జాతీయంగా క్రమంగా బంగారానికి డిమాండ్ పెరుగుతూ వస్తుంది. మన దేశంలో కూడా బంగారానికి డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొనుగోలు దారులు క్రమంగా బంగారంపై ఆసక్తి చూపిస్తుంది. మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news