ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి, అదే నాకు పెద్ద బహుమతి : రామ్ చరణ్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే అంటే హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రక్త దానాలు, అన్నదానాలు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటివి చేస్తూ రాష్ట్రమంతా మెగా అభిమానులు సందడి చేస్తుంటారు. అయితే కరోనా వైరస్ తాండవం చేస్తున్న ఈ సమయంలో వేడుకలను రద్దు చేయాలని, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకూడదని అభిమానులను రామ్ చరణ్ కోరిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ విజృంభించడంతో అందరూ ఇంటికే పరిమితమై ఉన్నారు. స్టార్ హీరో అయినా సరే.. సాధారణ జనమైనా సరే అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో బయటకు రావొద్దని, అందరూ లాక్ డౌన్‌ను పాటించాలని రామ్ చరణ్ అందర్నీ కోరాడు. తాజాగా రామ్ చరణ్ ఓ ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.

‘అర్దరాత్రి నుంచి వస్తున్న బర్త్ డే విషెస్‌, నా మీద కురిపించిన ప్రేమకు నాకెంతో ఆనందంగా ఉంది.. ఐ లవ్యూ ఆల్.. దీంతో పాటు.. మీ అందరికీ నేనో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. లాక్ డౌన్ ముగిసే వరకు దయచేసి మీరంతా ఇంట్లోనే ఉండండి.. అదే మీరు నాకిచ్చే అత్యంత గొప్ప బహుమతి.. ఇంట్లోనే ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news