డిమాండ్ లేకపోయినా పెరుగుతున్న బంగారం…!

-

డిమాండ్ లేకపోయినా సరే బంగారం ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ కి వచ్చి కొనుగోలు చేసే వాడు లేకపోయినా సరే బంగారం ధరలు మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. శనివారం బంగారం కాస్త ఎక్కువే పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర పది గ్రాములకు దాదాపు 500 రూపాయల మేర పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర… 510 రూపాయల పెరిగింది. దీనితో 41,770 రూపాయలుకు చేరింది.

24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే…పది గ్రాములకు 490 రూపాయల పెరగడంతో… 45,300 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం లలో 22 క్యారెట్లు పది గ్రాములకు 510 రూపాయల పెరగడంతో… 41,770 రూపాయలకు చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. పది గ్రాములకు 490 రూపాయల పెరగడంతో 45,300 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1950 రూపాయలకు పెరిగింది. దీనితో 45,200 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే కూడా 510 రూపాయల పెరగడంతో 42,560 రూపాయలకు చేరుకుంది. వెండి ధరలు కూడా పెరిగాయి. 41 వేల మార్కు కంటే ఎగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,410 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news