ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీ హుజూరాబాద్ ఎన్నికలపై ఫోకస్ పెడితే కాంగ్రెస్ మాత్రం సొంత నేతలపైనే ఫోకస్ పెడుతోంది. ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరికి ఇస్తారనే దానిపైనే రాజకీయాలు చేస్తున్నారు. తమ అనుకున్న వారికే వచ్చే విధంగా పావులు కదుపుతున్నారు. దీంతో కొద్ది కాలంగా ఊరిస్తున్న ఈ ఎన్నిక ఈరోజు పూర్తయ్యే అవకాశం కనపడుతోంది.
ఎందుకంటే రీసెంట్‌గా శరద్ పవార్ అధ్యక్షతన సుమారు 15పార్టీలు సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈ రోజు సోనియా గాంధీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ఆమె మీటింగ్ ఏర్పాటు చేశారు.
ఇదే క్రమంలో ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలపై, అదే విధంగా తెలంగాణ పీసీసీ చీఫ్‌పై కూడా ప్రకటన వచ్చే అవకాశంఉందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఎవరికి ఇస్తారనే అంశమే కీలకంగా మారనుంది. మరి అందరూ వ్యతిరేకిస్తున్న రేవంత్‌రెడ్డికి పగ్గాలు ఇస్తారా లేదా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం ఇస్తారా అన్నది చూడాలి.