అమరావతి : చిరు వ్యాపారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారు. నేడు జగనన్న తోడు పథకం కింద.. చిరు వ్యాపారులకు ఆర్ధిక సాయం చేయనున్నారు సీఎం జగన్. అంటే ఈ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందించేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇవాళ ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. లబ్దిదారుల ఖాతాల్లో ఆన్‌లైన్ విధానంలో నిధుల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేల చొప్పున వడ్డీ లేని రుణం ఈ పథకం కింద అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఏకంగా 5 లక్షల 10 వేల 462 మందికి లబ్ధి చేకూరనుంది. 510.46 కోట్ల వడ్డీ లేని రుణాలు, 16.16 కోట్ల వడ్డీ రీఇంబర్స్‌మెంట్ కలిపి మొత్తం 526.62 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో ఇవాల జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.