తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిన్నటితో పోలిస్తే.. ఈ రోజు కాస్త తగ్గింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో 1,673 కరోనా కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నిన్న రాష్ట్రంలో 2,606 కరోనా కేసులు వెలుగు చూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే ఈ రోజు 933 కేసులు తగ్గాయి. ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటన్ ఆధారంగా గడిచిన 24 గంటలలో ఒకరు కరోనా కాటుకు బలై పోయారు.
కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి 330 మంది కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గినా.. భయం మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించక పోవడం తో పాటు కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా ఎక్కువ ఉండటంతో రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలాగే ఇటీవల క్రిస్మస్, న్యూయర్ వేడుకలు కూడూ కరోనా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి.