కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో SRD, జిల్లా న్యాల్కల్తో పాటు జహీరాబాద్ మండలంలోని శివారు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు దాటుతున్న వ్యక్తులకు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించేందుకు చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వద్ద 24గంటల పాటు పోలీసులు అందుబాటులో ఉండనున్నారు.