ప్రజలు కారోనా నుండి తప్పించుకోలేక బాధపడుతుంటే.. మరోపక్క నుండి ప్రభుత్వాలు కూడా ప్రజలనే దెబ్బ కొడుతున్నాయి. డబ్బు లేక సంపాదన లేక జీవనం సాగిస్తుంటే వారికి మరిన్ని చిక్కులు తెచ్చే పనులు చేస్తుంది ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ చమురు ధరలు దంచికొడుతున్నాయి. పెట్రోల్ ధరలు ప్రతి రోజు పెరుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటరు డీజిల్ ధరను మంగళవారం 25 పైసలు పెంచాయి.
ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.80.78కు చేరుకుంది. మరోవైపు పెట్రోల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.80.43. ప్రభుత్వ చమురు కంపెనీలు జూన్ 29న పెట్రోల్, డీజిల్ ధరలను చివరి సారిగా సవరించాయి. అలాగే హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.83.49 వద్ద నిలకడగానే ఉంది. డీజిల్ ధర కూడా స్థిరంగానే రూ.78.69 వద్ద కొనసాగుతోంది.