టోక్యో: ఒలింపిక్స్‌లో క్రీడాకారులు దూసుకుపోతున్నారు. తాజాగా రోయింగ్ విభాగంలో సెమీస్‌కు భారత్ చేరుకుంది. లైట్ వెయిటింగ్ డబుల్ స్కల్స్ రెపికేజ్ సెమీ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. రోవర్స్ అర్జున్ లాల్-అర్వింద్ సింగ్ జోడీ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.
అంతకుముందు తెలుగు తేజం పీవీ సింధు ఒలింపిక్స్‌లో బోణీ కొట్టారు. గ్రూప్ జె తొలి మ్యాచ్‌లో సింధు శుభారంభం చేశారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు గెలుపొందారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై విజయం సాధించారు.
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్‌కు నిరశ మిగిలింది. మనుబాకర్, యశస్విని ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. మనుబాకర్ 12వ స్థానంలో నిలిచారు. యశస్విని 13వ స్థానంలో